21, అక్టోబర్ 2012, ఆదివారం

చంద్రమౌళి...

చంద్రమౌళి మనకిక లేరు...

తెలుగు బ్లాగ్ ప్రపంచానికి సుపరిచితుడు, తన కవితలతో చిత్రాలతో జీవశాస్త్ర పరిజ్ఞానంతో మనలను ఎంతో కాలంగా అలరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రమౌళి మనకి  ఇక లేరు...

   చెరగని చిరునవ్వుతో, తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో మమ్ములను ఇంతకాలం అలరించి తనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి దాచుకోగల్గినన్ని జ్ఞాపకాల్ని మిగిల్చి మనకందని కొత్త తీరాలకు మన జ్ఞాపకాలతో వెళ్ళిన  చంద్రమౌళి ప్రజ్ఞ కు కొన్ని మచ్చు తునకలు...























ఆర్య ఆట :)

నేను ఆర్యా ఆట(గులకరాయిని గ్లాసులో వెయ్యటం లేదా.. గ్లాసుని డస్టు బిన్లో వెయ్యటం లాంటివి) ఆడే ప్రతిసారీ, నా లవ్ సక్సెస్ అనే చూపెడుతుంది.. (అంటే అది వేస్తున్న కంటెయినర్లో కాకుండా ప్రక్కన పడితే నా లవ్ సక్సెస్ ఔతుంది అనుకుంటా లెండీ).... ఏంటో లవ్ సక్సెస్ అనే చూపించినా.. లవర్ దొరకదే... this is too much కదా??
 
 
 
 
 

http://mouliantharmadhanam.blogspot.in/2010/10/blog-post.html

http://liscience.blogspot.in/2011/07/blank-screen-with-initramfs.html

http://liscience.blogspot.in/2011/05/simulating-artificial-brain-for-robots.html

http://liscience.blogspot.in/2011/04/graphene-turns-spin-doctor.html

http://liscience.blogspot.in/2011/04/10-things-to-know-about-anna-hazare-and.html

http://mouliantharmadhanam.blogspot.in/2010/10/my-view-on-art-of-communication.html

The best work is here...

https://sites.google.com/site/chandramouliem/







అక్షరం

  అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది...
                                            

క్షరం  అంటే నాశనం
అక్షరం=నః క్షరం  - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం.
మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది.



 http://mouliantharmadhanam.blogspot.in/2011/09/blog-post.html

 ఈ విధంగా చంద్రమౌళి మన మధ్య కలకాలం అక్షర రూపంలో నిలచి పోతాడని ఆశిస్తూ ...

https://plus.google.com/116303915356952405601/about


2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కంప్యూటర్ భాష గురించి...

చాలా రోజుల తర్వాత మళ్లీ మీ ముందుకు ఒక పోస్ట్ తో వస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఇప్పటి వరకు కంప్యూటర్ తో మాట్లాడేందుకు ఒక భాష సమకూర్చుకున్నాం. ఇక కంప్యూటర్ కి ఆజ్ఞలు ఏ స్థాయి లో ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం.

   ఈ  ఈ సందర్భం లో నా చిన్నప్పటి ఒక వ్యాపార ప్రకటన గురించి ప్రస్తావించదలిచాను. "చిన్న మొత్తాల పొడుపు సంస్థ" కు సంబంధించిన ప్రకటన అందరికి గుర్తు ఉండే ఉంటుంది. "వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలు పెడదాం..." అని. అదే విధంగా ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న, మరియు మానవ సహితం కాని అనేక చిక్కు ముడులను విప్పుతున్న కంప్యూటర్ కూడా ఆ యొక్క అత్యంత క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి శ్రీకారం ఒక చిన్న గణిత ప్రక్రియ తో మొదలు పెడుతుంది అదే "కూడిక"; అది కూడా ద్వి-సంఖ్యా మానం లో కూడిక.

  ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం అయినా నమ్మి తీరాల్సిన అక్షర సత్యం. మిగిలిన సంక్లిష్టమైన గణిత ప్రక్రియలన్నీ కూడా ఈ ఒక్క కూడిక ద్వారానే సాధించ వచ్చు అని ఒకటో తరగతిలో మన మాస్టారు చెప్పిన పాఠాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే చిక్కుముడి చాలా త్వరగా విడి పోతుంది.

   ఉదాహరణకు "తీసివేత" ను రెండవ సంఖ్య యొక్క గుర్తును + నుండి - కు మార్చి కూడటం ద్వారా సాధించ వచ్చు. అలాగే "గుణించుట" ను మళ్లీ మళ్లీ కూడటం ద్వారా సాధించవచ్చును. అలాగే "భాగహారం" ను మళ్లీ మళ్లీ తీసివేయటం ద్వారా సాధించవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను కూడా"కూడిక" అనే అత్యంత సాధారణ గణిత ప్రక్రియ ద్వారా సాధించ గల్గుతుంది.

  ఇక ద్వి-సంఖ్యా మానంలో కూడికల సంగతి ఇప్పుడు చూద్దాం. మనం సాధారణ దశాంశ మానం లో గమనించినట్లైతే మనకు ఉన్న పది అంకెలు 00-09 తర్వాత వచ్చే సంఖ్య పదుల స్థానంలో ఉన్న అంకె ఒకటి పెరిగి, ఒకట్ల స్థానంలో ఉన్న అంకె తిరిగి తన మొదటి విలువ 0 ను తీసుకుంటుంది. అనగా 10 అవుతుంది. అలాగే ద్విసంఖ్యా మానంలో కూడా 0, 1 తర్వాత వచ్చే సంఖ్య 10 అవుతుంది. అటు తదుపరి 11, 100, 101, 110, 111, ... వస్తాయి.

  ఉదాహరణకు 25 ను ద్వి-సంఖ్యా మానం లో వ్రాసినట్లయితే 11001  అవుతుంది. దీనిని కొంత తేలికగా అర్ధం చేసుకోవాలంటే 25 గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి. 25 లో మొదటి అంకె 5 మరియు దాని స్థాన విలువ 1. అలాగే రెండవ అంకె 2 మరియు దాని స్థాన విలువ 10. అనగా 25 అనేది దానిలోని అంకెలను వాటి వాటి స్థాన విలువలతో గుణించి కూడగా వచ్చిన సంఖ్య. అనగా 5x1+2x10=25.

  ఇప్పుడు  దశాంశ మానంలో స్థాన విలువలు ఎలా మారుతున్నాయో చూద్దాం. ఇక్కడ మొదటి అంకె స్థాన విలువ 1. ఆ తరువాత అంకె స్థాన విలువ 10. (దశాంశ మానం కాబట్టి.) ఆ తరువాత అంకె స్థాన విలువ 100 (అనగా 10x10) తరువాతి అంకె స్థాన విలువ 1000 అనగా (10x10x10).

   ఇక ద్వి-సంఖ్యా మానం లో చూసినట్లయితే మొదటి అంకె స్థాన విలువ 1. తరువాతి అంకె స్థాన విలువ 2. (ద్వి-సంఖ్యా మానం కాబట్టి.) తరువాతి అంకె స్థాన విలువ 4. (2x2) తరువాతి అంకె స్థాన విలువ 8.(2x2x2). అటు తరువాతి అంకె స్థాన విలువ 16.(2x2x2x2). 

   పై విధంగా గమనించినట్లైతే 11001 యొక్క విలువ 1x1+0x2+0x4+1x8+1x16=25.

   ఇక ఒక దశాంశ మాన సంఖ్యను ద్వి-సంఖ్యా మానంలోకి తేలికగా మార్చటం ఎలాగ అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు 25 ని ద్వి-సంఖ్యా మానంలోకి మార్చుదాం. దీనికోసం ఆ సంఖ్యను సగం చేసి మిగిలిన శేషాన్ని దాని క్రింద వ్రాయండి. ఈ క్రింద చూపిన విధంగా.

     25  --> 12  -->  6 --> 3 -->  1  --> 0 
             1        0     0      1      1 
   ఈ సంఖ్యను కుడినుంచి ఎడమకు చదివినట్లైతే  మానం ద్వి-సంఖ్యా మానంలో 25 గా పైన చెప్పుకున్న సంఖ్య 11001 వస్తుంది. ఈ విధంహా మానం ఏ సంఖ్యనైనా ద్వి-సంఖ్యా మానంలోకి మార్చవచ్చును.

  మరొక ఉదాహరణగా 32 ను ద్వి-సంఖ్యా మానంలోకి మార్చి చూద్దాం. 
   32 --> 16 --> 8  --> 4 --> 2 --> 1  --> 0
          0      0      0     0     0      1 

   అనగా 32 ను ద్వి-సంఖ్యా మానంలో 100000 గా వ్రాయ వచ్చును. దీనిని స్థాన విలువలతో సరిచూద్దాం. దీని స్థాన విలువలను గణించినట్లైతే 0x1+0x2+0x4+0x8+0x16+1x32=32 అవుతుంది. 
ఇక కూడికలను ఈ క్రింద చూపిన విధంగా చేయవచ్చును.


http://i53.tinypic.com/2d7zj48.gifhttp://i53.tinypic.com/2lihpp2.gif 


 ఇక తీసివేత విషయానికి వస్తే, ఉదాహరణకు మనం 269-34(=235) ఎంతో కనుక్కోవాలనుకుందాం. మనం 69 లో నుండి 34 ను తీసివేసే బదులు, 69 కి 34 యొక్క పూర్ణ భాగస్వామిని (అనగా 34 కి ఏమి కలిపితే దగ్గరలోని పరిపూర్ణ సంఖ్య అనగా 1000 (ఇది సమస్య లోని అన్ని సంఖ్యల కన్నా పెద్దదైన పరిపూర్ణ సంఖ్య. గమనించగలరు.) వస్తుందో,ఇక్కడ అది 966 అవుతుంది.) కలిపినట్లయితే 269+966=269+(1000-34)=1235 అవుతుంది. సరిగ్గా గమనించినట్లైతే మనం రెండవ సంఖ్య ను తీసివేయ్యటానికి బదులుగా దాని పూర్ణ భాగస్వామిని మొదటి సంఖ్యకు కలుపుతున్నాము. అనగా మొత్తం లెక్కలో ఒక పరిపూర్ణ సంఖ్య 1000 ని అదనంగా కలుపుతున్నాము. కాబట్టి మనకు సరైన సమాధానం కావాలంటే తుది సమాధానం నుండి ఆ పరిపూర్ణ సంఖ్యను తీసివేసినట్లితే సరిపోతుంది. ఇంకా తేలికగా చెప్పాలి అంటే తుది సమాధానంలో ఎడమ చివరి అంకెను విస్మరించినట్లైతే మిగిలినదే మనకు కావలిసిన సమాధానం అవుతుంది. 

 ఆ విధంగా ఫకీర్ బాబా తాయెత్తు లాగ, సర్వ రోగ నివారిణి లాగ ఒక్క గణిత ప్రక్రియతోనే ప్రాధమిక గణిత సమస్యలనన్నిటిని పూరించ గల్గుతున్నాం. కాకపొతే ఇక్కడ వచ్చిన సమస్యల్లా ఆ రెండవ సంఖ్య యొక్క పూర్ణ భాగస్వామిని కనుక్కోవటం ఎలాగ? దానికోసం మరొక తీసివేత చెయ్యాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 

 ఆ విధంగా కంప్యూటర్ కి చెప్పటానికి తేలికగా ఉంటుంది అని ఒక్క గణిత ప్రక్రియనే ఎంచుకొని మన పూర్వ గణిత పరిజ్ఞానాన్ని అంతా త్రవ్వి తీసి మన గణిత పద్ధతులనే మార్చుకుంటే మళ్లీ సమస్య మొదటికి వచ్చిందే అనే సందేహం కలగవచ్చు. 

 కాని ఇప్పటివరకు మనం చూసింది దశాంశ మానం లో తీసివేత గురించి. అదే ద్వి-సంఖ్యా మానంలో తీసివేతలో ఏమైనా సౌలభ్యం ఉందేమో చూద్దాం. ద్వి-సంఖ్యా మానంలో 0 నుండి 1 ని తీసివేయవలసిన సందర్భంలో  0 యొక్క ఉన్నత స్థానం నుండి 1 అప్పుగా తీసుకుంటాము. అది ప్రస్తుత స్థానంలో 2 గా మారుతుంది. ఉదాహరణకు ఈ క్రింది తీసివేతను గమనించండి.
 http://i54.tinypic.com/oj09kn.gif

మరొక ఉదాహరణగా 25-9 ని ద్వి-సంఖ్యా మానంలో చేసి చూద్దాం. అనగా మనం 11001-01001 విలువను మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనం సాధారణ పద్దతిని ఉపయోగించినట్లైతే సమాధానం 10000 గా గుర్తించవచ్చు. అయితే మన పధ్ధతి ద్వారా అయితే 01001 కి మనం పూర్ణ భాగస్వామిని కనుక్కోవాలి. అనగా దగ్గరలోని పరిపూర్ణ సంఖ్య 100000 నుండి దానిని తీసివేస్తే వచ్చిన సంఖ్య మనకు కావాలి. గణించి చూసినట్లయితే దాని విలువ 10111 గా గుర్తించవచ్చును. సరిగ్గా గమనించినట్లైతే అది మన సంఖ్య 01001 లో సున్నాలు, ఒకట్లను తారుమారు చేస్తే వచ్చిన సంఖ్య 10110 కి 1 కలిపితే వచ్చే సంఖ్య కు సమానం అవుతుంది.

 మీకు ఇంకా అనుమానంగా ఉంటే 01010 కి సంబంధించిన పూర్ణ భాగస్వామిని కనుక్కోండి. దాని విలువ 10101 కి 1 కలుపగా వచ్చే సంఖ్య 10110 అవుతుంది. 

 ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పుకున్నట్లుగా 1 ని వెలిగే బల్బ్ గాను 0 ను ఆరిపోయిన బల్బ్ గాను గుర్తించినట్లితే అన్ని ఆరి పోయిన దీపాలను వెలిగించి అన్ని వెలుగుతున్న దీపాలను ఆర్పమని చెప్పటం, అనగా 0 మరియు 1 లను తారుమారు చెయ్యమని కంప్యూటర్ కి చెప్పటం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. అటు తర్వాత జరిగే పని 1 ని కూడటం. అది కంప్యూటర్ కి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మనం దాని గురించి ఆలోచించ వలసిన అవసరం లేదు. ఆ విధంగా కంప్యూటర్ చేత తీసివేత కూడా చేయించ వచ్చును. 

 తరువాతి గణిత ప్రక్రియ "గుణించుట". ఉదాహరణకు 2x5=10 ని మనం 2+2+2+2+2=10 గా గణించ వచ్చును.

   ఇక మిగిలిన గణిత ప్రక్రియ "భాగహారం". ఉదాహరణకు 5/2=2.5 అనే విలువను గణించటానికి మనం "తీసివేత" ను ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాము. 5-2-2=1 ఇక్కడ రెండును ఎన్ని సార్లు తీసివేస్తున్నాము అనేది లెక్కించగల్గితే సమాధానంలో చుక్కకు ముందు అంకె అనగా 2 వస్తుంది. ఇక శేషం 1 ని 10 తో (ద్వి-సంఖ్యా మానం లో ఐనట్లైతే 2 తో) గుణించినట్లైతే 10 వస్తుంది. ఇప్పుడు మరలా తీసివేత కార్యక్రమాన్ని కొనసాగించినట్లైతే 10-2-2-2-2-2=0. ఈ సారి రెండును 5 సార్లు తీసివేయవలసి వచ్చింది. అనగా మన సమాధానం లో చుక్క తరువాత మొదటి అంకె వచ్చింది. ఇక శేషం ఏమి మిగలలేదు కాబట్టి మన భాగహార ప్రక్రియ ఇంతటితో ఆపివేయ వచ్చును. ఒక వేళ ఇంకా శేషం ఉన్నట్లయితే మరలా పదితో గుణించి తీసివేత కార్యక్రమాన్ని కొనసాగించ వలసి ఉంటుంది. దీనితో భాగహారాన్ని కూడా కూడికల రూపం లోకి మార్చగలిగాము.

ఆ విధంగా కంప్యూటర్ కి ఆజ్ఞలు ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక కంప్యూటర్ లోపల మన ఆజ్ఞలను గుర్తించటానికి పాటించటానికి ఎటువంటు ఏర్పాట్లు ఉన్నాయి అనే విషయం తదుపరి పోస్ట్ లో చూద్దాము.

 దీనిని బట్టి చూస్తే కంప్యూటర్ కి మనకి తెలిసినంత కూడా తెలియదని అర్ధం అవుతోంది. కాబట్టి దానిని ఒక మానవాతీత మహా శక్తి అని ఊహించాల్సిన అవసరం లేదనుకుంటాను. కాకపోతే వంద ఉపాయాలు తెలిసిన నక్క కన్నా ఒక్క ఉపాయం తెలిసిన పిల్లి బ్రతికి బట్ట కట్టినట్లు ఒకే ఒక గణిత విధానం తెలిసిన కంప్యూటర్ దానినే అనేక సార్లు విసుగు విరామం లేకుండా ఉపయోగించటం వలన మనుషులను మించిన పనులను చేయగల్గుతుంది. 

http://i53.tinypic.com/2lusaqt.jpg

 ఏవిధంగానైతే వినాయకుడు తనకు తెలిసిన తల్లిదండ్రులను పూజించటం అనే ఒకే విద్యను భక్తి తో ఆచరించి గణాధిపత్యం పొందాడో, అలాగే కుమార స్వామి అన్ని తెలుసుననుకొని అభాసుపాలయ్యాడో అలాగే కంప్యూటర్ ముందు మనిషి తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది.

 తదుపరి పోస్ట్ లో మరిన్ని విషయాలతో మీ ముందుంటాను... అంత వరకు శెలవు తీసుకుంటూ...


26, ఫిబ్రవరి 2011, శనివారం

POST లలో జాప్యానికి చింతిస్తూ...

నా బ్లాగ్ ను ఆదరిస్తున్న అభిమానిస్తున్న పాఠక మహాశయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు...
 గత రెండు వారాలుగా నా బ్లాగ్ లో కొత్త post లు లేనందుకు చింతిస్తున్నాను. కొన్ని అనివార్యమైన పనుల వత్తిడి వలన బ్లాగ్ ను నిర్లక్ష్యం చేయ వలసి వచ్చింది. ఎంతో ఆత్రుతగా నా తదుపరి post కోసం ఎదురు చూస్తున్న పాఠకుల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నందుకు మన్నించగలరు. నా తదుపరి post ల పరంపర March మూడవ వారంతం నుండి అనగా 19 వ తేది నుండి ఉంటుంది. అప్పటి వరకు మీ అభిమానం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ...


మీ
సంజీవ్

12, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రాధమిక పరిజ్ఞానం -2

కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమాచార నిల్వ మరియు సమాచార విశ్లేషణ గురించి ప్రాధమిక సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము...

పూర్వం ఆదిమానవుడు సంచార జీవితం గడిపేటప్పుడు ఎక్కడ నీరు ఆహారం పుష్కలంగా ఉంటుందో అక్కడకు వెతుక్కుంటూ వెళ్ళేవాడు. దాని కోసం ముందుగా ఒక వ్యక్తి ఈ ప్రాధమిక అవసరాలను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. అవి ఎక్కడ లభిస్తే అక్కడ ఎండు కొమ్మలు, పచ్చి ఆకులు తగులబెట్టి పొగ రాజేసేవాడు. దానిని బట్టి మిగిలిన తెగ మొత్తం అక్కడకు చేరుకునేది. మొదటి సారిగా ఈ విధంగా నిప్పును సందేశాలను చేరవేయటానికి ఉపయోగించారు.
http://i55.tinypic.com/16bk39c.gifASCII Code


ఆ తరువాత దానినే యుద్ధ సమాచారాలను చేరవేయటానికి ఉపయోగించారు.
http://i55.tinypic.com/18ltmt.jpg http://i51.tinypic.com/25ppl5g.jpg
 ఇప్పటికీ మనం ఈ విధానాన్ని సముద్ర ప్రయాణంలో ఉపయోగిస్తున్నాము.
http://i51.tinypic.com/29d7rk2.jpg
 ఈ విధంగా చీకటి వెలుగులను సృష్టించటం ద్వారా సమాచారాన్ని ఒక చోటినుంచి మరొక చోటికి చేరవేసేవారు.


ప్రస్తుత కాలంలో ఈ చీకటి వెలుగులను సృష్టించటానికి మనం విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నాము. స్విచ్ ని ON మరియు OFF చెయ్యటం ద్వారా లైట్ ని వెలిగించి ఆర్ప గలుగుతున్నాము. ఎదుటి మనిషి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియని సమయంలో కూడా ఈ పద్దతి సమాచారాన్ని చేరవేయటానికి ఉపయోగపడింది.

 అలాగే మనం ఎలా ఉంటుందో తెలియని కంప్యూటర్ తో మాట్లాడాలంటే ఇలాంటి ON మరియు OFF మాత్రమే ఉన్న అత్యంత తేలిక పాటి భాష ఒకటి కావాలి. అదే Binary Code. లాటిన్ భాష లో Bi అంటే 'రెండు' అని అర్ధం. ఈ భాష లో రెండే పదాలు ఉన్నాయి కనుక ఆ పేరు వచ్చింది. కంప్యూటర్ ఎలాగు కరెంట్ తోనే పని చేస్తుంది కాబట్టి switch ON మరియు switch OFF లను గుర్తించ గల్గుతుంది.(దీనికి ప్రత్యేక ఏర్పాట్లు కావాలి. అవేమిటో తదుపరి post లో చూద్దాం.)


కంప్యూటర్ పరిభాషలో ON ను 1 గాను మరియు OFF ను 0 గాను సూచిస్తారు. మనం సాధారణంగా ఉపయోగించే దశాంశ మానం (0-9)లాగానే దీనిని ద్విసంఖ్యా మానం అంటారు. మొత్తం భాషలో 0 మరియు 1 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు 
రెండంకెలతో మనం నాలుగు వేర్వేరు సంఖ్యలను సృష్టించవచ్చు.
  00 01 10 11     2 x 2 = 4 
మూడంకెలతో మనం ఎనిమిది వేర్వేరు సంఖ్యలను మనం సృష్టించవచ్చును. ఈ క్రింది విధంగా...

       000 001 010 011  

       100 101 110 111        2 x 2 x 2 = 8 
అదే విధంగా 4 అంకెలతో 2x2x2x2 = 16 వేర్వేరు సంఖ్యలను సృష్టించవచ్చును.
ఆ తరువాత అమెరికా వారు మనం ఎక్కువగా ఉపయోగించే 128 అక్షరాలు, అంకెలు మరియు గుర్తులతో పాటు మనం అంతగా ఉపయోగించని మరొక 128 గుర్తులను కలిపి ASCII అనే ప్రామాణిక భాషను తయారు చేసారు. దానిని మనం ఇప్పుడు చూద్దాం.
ఈ మొదటి 31 కంప్యూటర్ ని నియంత్రించటానికి ఉపయోగిస్తారు.
http://i53.tinypic.com/154bu6u.png 
 ఈ తరువాత 97 సాధారణంగా ఉపయోగించేవి.
http://i54.tinypic.com/2d0lw07.png     http://i54.tinypic.com/2urat8g.png 

మరికొన్ని అంతగా ఉపయోగించని ప్రత్యేక చిహ్నాలు.
http://i55.tinypic.com/15hii6f.png    http://i55.tinypic.com/wtai35.png



ఆ విధంగా మనం ఉపయోగించే 256 వేర్వేరు గుర్తులను 256 ద్విసంఖ్యా మాన సంఖ్యలతో సూచించారు. అనగా ద్విసంఖ్యామానం లో  (2x2x2x2x2x2x2x2 = 256) ఎనిమిది అంకెల సంఖ్య అవుతుంది. కంప్యూటర్ పరిభాషలో ఒక్కొక్క ద్విసంఖ్యామాన అంకెను "Bit" (బిట్) అంటారు. అలాగే మొదటి 256 ద్విసంఖ్యామాన సంఖ్యలలో ఒక్కొక్క ఎనిమిది అంకెల సంఖ్య మనం ఉపయోగించే ఒక్కొక్క అక్షరాన్ని సూచిస్తుంది కాబట్టి దానికి కూడా ఒక పేరు పెట్టారు. అదే "Byte" (బైట్). 


ఆ విధంగా మనం చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని keyboard మీద టైపు చేసి కంప్యూటర్ కి చెప్పవచ్చును. అది binary భాషలో కంప్యూటర్ కి చేరుతుంది. 


ఇప్పటివరకు మనం కంప్యూటర్ కి అర్ధం అయ్యే భాషను తయారు చేసుకున్నాము. ఇక వచ్చే ముఖ్యమైన సమస్య దానికి ఏ స్థాయి లో ఆజ్ఞలను ఇవ్వాలనేది. దాని గురించి తరువాతి post లో చూద్దాం...

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

Processor గురించి... -1

ఇప్పటి వరకు ఉన్న ప్రాధమిక పరిజ్ఞానంతో CPU లోపల ఉన్న Processor గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా CPU యొక్క నమూనా పటాన్ని ఇప్పుడు చూద్దాం.
http://i53.tinypic.com/4qg1p0.jpg
 ఇక్కడ అన్నిటికన్నా పైన ఉన్నది Processor. ఇది కంప్యూటర్ కి చిన్న మెదడు లాంటిది అని చెప్పుకున్నాము. కానీ పటంలో CPU అని గుర్తించబడి ఉన్నది ఏమి అని అడగవచ్చును. మీరు CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో చర్చనీయాంశాలను చూసినట్లయితే CPU గురించి ఒక విషయం గమనించి ఉంటారు. అది ఏమంటే "సందర్భాన్ని బట్టి CPU ని Processor , Memory, మరియు ఇతర భాగాలతో కూడిన డబ్బాగా అనుకోవచ్చును. లేదంటే ఒక్క Processor నే CPU గా అభివర్ణించవచ్చును." అని. మనం CPU లోపల ఉన్న చిన్న చిన్న భాగాలను గురించి వివరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి; ఈ సందర్భంలో CPU అనేది Processor అవుతుంది. (తదుపరి చర్చ మొత్తంలోనూ Processor అన్న పదమే ఉపయోగింపబడింది. పాఠకుల అవగాహన కొరకు మాత్రమే పై వివరణ ఇవ్వబడింది.)


పై పటంలో Processor తరువాత ముఖ్యంగా కనబడుతున్నవి చదరంగా ఉన్న మరొక రెండు భాగాలు. అందులో పైన ఉన్నది North bridge అనగా ఉత్తర వారధి. క్రింద ఉన్నది South bridge అనగా దక్షిణ వారధి. పై పటాన్ని ప్రపంచ పటంగా అనుకుంటే ఉత్తర దిక్కున ఉన్న దానిని ఉత్తర వారధి అన్నారు. దక్షిణ దిక్కున ఉన్న దానిని దక్షిణ వారధి అన్నారు. అవి ఇతర భాగాలకు Processor కు నడుమ వారధులుగా పని చేస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది.


ఇక పోతే ఈ north bridge కి processor కి నడుమ ఉన్న మార్గాన్ని system bus లేక local bus లేక Front Side Bus అంటారు.  అంటే రాజ మార్గము అని చెప్పుకోవచ్చును. ఇది CPU లోకెల్లా అత్యంత వెడల్పైన అత్యంత వేగవంతమైన BUS. (CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో ఇప్పటికే చెప్పి ఉన్నాను BUS అనగా మార్గము అని, సాధారణ ప్రయాణ సాధనం లాంటిది కాదు అని; గమనించగలరు.) ఈ north bridge ద్వారా అత్యంత వేగంగా పనిచేసే, అత్యంత వేగం అవసరం ఐన సాధనాలు system bus కి కలుపబడి ఉంటాయి. ఉదాహరణకి గమనించినట్లైతే RAM, PCI express, Graphic card లాంటివి. ఈ north bridge లో సమాచార వేగం దాదాపుగా processor వేగానికి సమానంగా ఉంటుంది. (ఈ వేగాలు యెంత ఉంటాయి అనేది అంకెలలో త్వరలో తెలుసుకుందాము.) 


ఇక మిగిలిన Hard disk , sound card , USB ports మరియు ఇతర PCI పోర్ట్ లు south bridge ద్వారా north bridge కి తద్వారా system bus కి కలుపబడి ఉంటాయి. ఈ south bridge లో సమాచార వేగం north bridge తో పోలిస్తే సుమారు 5 నుంచి 10 వ వంతు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా processor కి కలుపు బడుతున్న భాగాలు అంత వేగంగా పని చెయ్యలేవు కాబట్టి వాటికి అంత వెడల్పైన BUS అవసరం లేదు. ఈ south bridge కి north bridge కి మధ్య ఉన్న bus ని PCI BUS అంటారు. ఎందుకంటే దీని ద్వారా దాదాపుగా అన్నీ బాహ్యంగా కలుపబడే (peripheral) మరియు వేగం పరంగా అంత ప్రాధాన్యం లేని భాగాలే కలుపబడుతున్నాయి కాబట్టి.


ఎలాగైతే మహారాజుకి ఆంతరంగిక సలహాదారులు, ప్రధాన మంత్రి అత్యంత ఆప్తులుగా ఉండి అంతఃపురంలో కూడా మహారాజును కలవగలరో అలాగే ఈ north bridge ద్వారా కలుపబడినవి కూడా CPU కి అంత ముఖ్యమైనవి. CPU యొక్క సామర్ధ్యాన్ని వేగాన్ని నిర్ధారించేవి ఈ north bridge ద్వారా కలుపబడిన భాగాలే. ఇక పోతే ఎలాగైతే మిగిలిన అధికారులు, ప్రజలు, యాత్రికులు మహారాజుని కలవాలంటే సభలో మాత్రమే కలవగలరో, అలాగే ఈ south bridge ద్వారా కలుపబడిన భాగాలు కూడా అంత ప్రాధాన్యత సంతరించుకోక north bridge ద్వారా processor కి కలుప బడతాయి. ఇవి మన CPU కి అదనపు హంగులు మాతమే అవుతాయి.


కాబట్టి మన CPU యొక్క సామర్ధ్యాన్ని, వేగాన్ని నిర్ధారించే processor, RAM మరియు ఇతర భాగాలను గురించి తదుపరి post లో వివరంగా తెలుసుకుందాము.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

కంప్యూటర్ పదజాలం - 1

మనం ఇప్పటి వరకు రకరకాల కంప్యూటర్ భాగాలను గురించి పరికరాలను గురించి తెలుసుకున్నాము. అయితే వాటిలో వచ్చిన కొన్ని క్లిష్టమైన మరియు ఒకే విధంగా అనిపించి వేర్వేరు అర్ధాలు ఉండి తికమక పెట్టే కొన్ని పదాలను మనం ఇక్కడ చూద్దాం.

CARD:
   VGA card, SOUND card, LAN card అనే పదాలను మనం ఈ post లో గమనించాము. card అంటే మన post card లాగా దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ముక్క అని అర్ధం. ఉదాహరణకు LAN card, sound card లను ఈ క్రింద గమనించండి.
http://i53.tinypic.com/sz9wsx.jpghttp://i56.tinypic.com/211vvad.jpg


PORT:
      PORT అనగా ప్రవేశ ద్వారము అని అర్ధం.  సాధారణంగా ఈ పదాన్ని మనం విశాఖ పోర్టు, ముంబాయి పోర్టు అని సముద్ర తీరాన్ని గురించి చెప్పే సందర్భంలో వింటూ ఉంటాము. అక్కడ కూడా port అనే పదం సముద్రం లో ప్రయాణించే వాహనాలు (ఓడలు లాంటివి.) నేలను చేరటానికి ప్రవేశ మార్గము ఆనే ఉద్దేశ్యంలో ఉపయోగిస్తారు.
http://i51.tinypic.com/2yvoth4.png
కంప్యూటర్ కి సంబంధించిన వివిధ విడి భాగాలను అనుసంధానం చెయ్యటానికి CPU కి ముందు (ఈ POST చూడండి.)కానీ వెనుక (ఈ POST చూడండి.)కానీ ఉన్న భాగాలనే PORT లు అంటారు.

SLOT:
      slot అనగా చీలిక లాంటి ద్వారము అని అర్ధము. దీనిని మనము PCI slot లను గురించి చర్చించే సమయంలో గమనించాము. (ఈ post చూడండి.)మరి పంచతంత్రం లోని కోతి-మేకు కథ ఏమైనా గుర్తుకు వచ్చిందా..
http://i56.tinypic.com/2emlmc1.jpg
JACK:
     మనము విద్యుత్ ఉపకరణాలలో ఉపయోగించే plug మరియు socket ల మాదిరిగానే ఒక రకం plug మరియు socket లను jack - plug మరియు jack - socket అంటారు. అవి ఈ క్రింద చూపిన విధంగా ఉంటాయి. ఈ పదాన్ని మనం ఈ POST లో గమనించాము.
http://i55.tinypic.com/6hq2k8.jpg


DRIVE:
      ఈ పదాన్ని మనం HARD DRIVE, USB DRIVE, PEN DRIVE, CD/DVD DRIVE లాంటి పదాలతో పాటుగా ఉపయోగించము. DRIVE అనగా నడుపునది అని అర్ధము. ఈ క్రింది పదాలను గమనించండి. 


    CD/DVD DRIVE:
              ఇది మనకు చిరపరిచితమే. దీనిని మనము ఈ POST-1 POST-2 లలో చూసాము.

    FLOPPY DRIVE:
            దీనికి సంబంధించిన అసలు పదం FLOPPY DISK DRIVE. అనగా floppy disk ను నడుపునది అని అర్ధము. Floppy అనగా "మృదువైన" లేక "వంగే గుణం కలిగిన" అని అర్ధం. Floppy disk ఈ క్రింద చూపిన విధంగా ఉంటుంది.
http://i56.tinypic.com/34pm64h.gif   http://i55.tinypic.com/1zx4d45.jpg
             
పైన మొదటి పటంలో మధ్యలో నల్లగా ఉన్న చక్రమే floppy డిస్క్ లో వంగే గుణం కలిగిన చక్రం. ఈ floppy disk ను నడిపే సాధనాన్ని Floppy disk drive అంటారు. అది ఆ ప్రక్క పటంలో చూపబడింది.


    HARD DRIVE:
            దీనికి సంబంధించిన అసలు పదం HARD DISK DRIVE. అనగా HARD DISK ను నడుపునది అని అర్ధము. దీనికి సంబంధించిన వివరాలు ఈ post లో ఉన్నాయి. ఈ post ను గమనించినట్లైతే గుండ్రంగా గ్రామ్ ఫోన్ ప్లేట్ లాగా ఉన్న హార్డ్ డిస్క్ ను నడపటానికి కావలసిన పరికరాలతో నిండి ఉన్న పూర్తి పెట్టెను హార్డ్ డిస్క్ డ్రైవ్ అన్నారు. ఇందులో ఉన్న డిస్క్ అప్పటి వరకు పరిచయం ఉన్న floppy లో ఉన్న డిస్క్ కన్నా ధృడంగా ఉండటం వలన దీనికి Hard disk అని పేరు వచ్చింది.


  

       USB /PEN DRIVE:
                దీనికి సంబంధించిన అసలు పదం USB flash drive. USB అనే పదం గురించి పూర్తి వివరాలు త్వరలో తెలుసుకుందాము. దీనిని USB పోర్ట్ ద్వారా కంప్యూటర్ కి అనుసంధానం చేస్తారు. ఇది కలం పరిమాణంలో ఉండటం వలన దీనిని పెన్ డ్రైవ్ అని కూడా పిలుస్తారు. ఈ పెన్ డ్రైవ్ లోపల గమనించినట్లైతే ఈ విధంగా ఉంటుంది.

http://i53.tinypic.com/25lyc.jpg
ఇక్కడ మధ్యలో నల్లగా ఉన్న భాగమే flash మెమరీ. ఇది కూడా ఒక రకమైన జ్ఞాపకాలను భద్రపరచుకునే భాగమే. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులోని సమాచారాన్ని (జ్ఞాపకాలని) మెరుపు మెరిసేంత తక్కువ కాలంలో చేరిపివేయవచ్చును, మన విఠాలాచార్య సినిమా లో మాయల ఫకీరు లాగా. ఇక్కడ flash అంటే మెరుపు అని అర్ధము. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఈ flash memory ని నడిపే మొత్తం పరికరాన్ని flash memory drive అన్నారు.


మిగిలిన పదాలను త్వరలోనే తెలుసుకుందాము...

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

CPU లోపల ఏముంది? - 3

ఇప్పటి వరకు CPU లో సమాచార నిల్వకు సంబంధించిన భాగాలను గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు కంప్యూటర్ లోని ఇతర ముఖ్య భాగాలను గురించి తెలుసుకుందాము. 
http://i56.tinypic.com/9ulxqu.png 
 ఈ పటంలో కనిపించే 5వ భాగం CD/DVD ప్లేయర్. ఇది మనం చూసే సినిమా CD, DVD లను ప్లే చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇందులో కొత్తగా వస్తున్న మార్పు ఏమంటే BLU-RAY డిస్క్. మనకు తెలిసినంత వరకు సాధారణంగా CD లో అయితే ఒక్క సినిమా అదే DVD లో ఐనట్లైతే 5-6 సినిమాలు పడతాయి. ఇక్కడ CD అంటే compact disk, మరియు DVD అంటే digital video disk. మరి ఈ blu ray డిస్క్ విషయానికి వస్తే ఇందులో 25GB అనగా 35 సినిమాలు పడతాయి. 
http://i56.tinypic.com/294ht3b.jpg
ఈ blu Ray డిస్క్ చూడటానికి సాధారణ DVD లాగానే ఉన్నది. మరి అందులో అంత ఎక్కువ సమాచారాన్ని ఎలా నిల్వ చేసుకోగల్గుతుంది అనే అనుమానం కలుగవచ్చు. DVD కి BLU RAY డిస్క్ కి ముఖ్యమైన తేడా ఆ డిస్క్ లో కాక అందులో సమాచారాన్ని వ్రాసే విధానంలో ఉంది. మనం స్కెచ్ పెన్ తో అక్షరాలను వ్రాస్తే అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అదే మామూలు పెన్ తో వ్రాస్తే అది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఈ క్రింద చూపిన విధంగా...
http://i53.tinypic.com/25irjiq.jpghttp://i52.tinypic.com/24oye12.jpg
అదే విధంగా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో DVD లో కన్నా దగ్గరగా సమాచారాన్ని వ్రాసే వ్యవస్థను తయారు చేసారు. మరి అంత దగ్గరగా వ్రాసినప్పుడు తట్టుకునే విధంగా blu ray డిస్క్ ను DVD కన్నా ఎక్కువ సాంద్రత (density)తో తయారు చేసారు. దీనిని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుసుకుందాము. ఈ blu ray డిస్క్ ఇంకా అంత ప్రాచుర్యం లోకి రాలేదు. 


మరి ఈ CD/DVD డ్రైవ్ యేవిధంగా ఉంటుందో చూద్దాం.
http://i55.tinypic.com/msce8o.jpghttp://i55.tinypic.com/2drfhc8.jpg
ఈ విధంగా ఈ CD/DVD  డ్రైవ్ లకు కూడా ఒక power కేబుల్ మరియు ఒక DATA కేబుల్ ఉంటాయి. ఆ నలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉన్నది POWER CABLE. ఆ రెండవది DATA కేబుల్. గమనించినట్లైతే దీనికి కూడా IDE మరియు SATA అని రెండు రకాల connections ఉన్నాయి. mothebard మీద హార్డ్ డిస్క్ ను ఎక్కడైతే కలుపుతామో ఈ DVD Drive ను కూడా అవే socket లలో కలుపవచ్చు. అందుకే motherboard మీద ఒకటి కన్నా ఎక్కువ sockets ఉంటాయి. మరిన్ని వివరాలకు ముందు POST గమనించగలరు.


ఇక motherboard మీద అంతటి ప్రాధాన్యత సంతరించుకోని అతి ముఖ్యమైన భాగం PCI SLOT. అది మొదటి పటంలో 7వ భాగం. PCI ని విస్తరిస్తే Peripheral Component Interconnect అవుతుంది. అనగా CPU కి, బాహ్యంగా అనుసంధానం చేసే భాగాలకి మధ్య వారధి అని అర్ధం చెప్పుకోవచ్చును. కంప్యూటర్ ప్రధాన భాగాలను పక్కన పెడితే మనకు అవసరమైన అదనపు భాగాలను connect చెయ్యటానికి దీనిని ఉపయోగిస్తారు. మరి అసలు అదనపు భాగాలు ఎందుకు అవసరం అవుతాయి, ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం. 


మనం ఒక మంచి కారు కొని దేశ రాజధానికి ప్రయానమవుతున్నాం అనుకుందాం. రాజధాని కాబట్టి దానిని చేరుకోవటానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. మొదటిది హైవే (ప్రధాన రహదారి) అయితే మరొకటి సాధారణ మార్గం. 


http://i52.tinypic.com/a056s.jpghttp://i51.tinypic.com/20koetf.jpg

 మరి మన కారు యొక్క పూర్తి వేగాన్ని చూడాలి అంటే మనం తప్పని సరిగా ప్రధాన రహదారిలోనే ప్రయాణం చెయ్యాలి.

అలాగే మనం CPU వెనుక భాగాన్ని గమనించినట్లైతే (ఇక్కడ చూడండి.) అక్కడ ఉన్న LAN port కానీ VGA పోర్ట్ కానీ, AUDIO ports కానీ ప్రస్తుతం వస్తున్న అధునాతన పరికరాల వేగంతో పని చెయ్యక పోవచ్చును. అలాగని వాటిని మార్చాలి అంటే మొత్తం motherboard ని మార్చాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ PCI slots ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ PCI slots పూర్తి స్థాయి bus నిడివితో motherboard కి కలుపబడి ఉంటాయి. (ఇక్కడ bus అంటే కంప్యూటర్ లో సమాచారం ప్రయాణించే మార్గము. అంతే కానీ వాహనం కాదు. గమనించ గలరు.)అనగా ఆయా అధునాతన పరికరాల పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తాయి. 

 మరి ఇక్కడ ఉన్న అన్ని PCI slot లు ఒకే విధంగా ఈ క్రింద చూపిన విధంగా ఉంటే, అవే slots; VGA card కి, AUDIO card కి, LAN card కి ఒకే విధంగా ఎలా పని చేస్తాయి అనే అనుమానం రావచ్చును. 
http://i51.tinypic.com/4lnlt3.jpg http://i53.tinypic.com/2d9v1n4.jpg

 (ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నవి PCI slot లు.) మనకు ఎలాగైతే ఎడ్ల బండి, సైకిలు, స్కూటరు, కారు, లారీ వంటి వివిధ వాహనాలు వచినప్పటికి రోడ్డు మాత్రం ఒకటే ఉన్నదో అదే విధంగా వివిధ పరికరాలు ఉన్నప్పటికీ ఈ PCI slots మాత్రం ఒకే విధంగా ఉండేలాగా నిర్మించబడ్డాయి. అంటే ఇవి ఒక విధంగా processor ని చేరుకోవటానికి ఒక దగ్గర మార్గం మాత్రమే అంతే కానీ ఒక పరికరం కాదు గమనించ గలరు.

ఏ విధంగా అయితే వినాయకుడు పితృభక్తితో గణాధిపత్యాన్ని సులభంగా పొందాడో, అదే విధంగా కొత్త పరికరాలు ఈ PCI slots ద్వారా పూర్తి వేగంతో CPU వెనుక ఉండే port ల కన్నా ముందుగా processor ని చేరి ఉపయోగింప బడతాయి. ఉదాహరణకు vga card ని గమనిద్దాం. అది ఈ విధంగా ఉంటుంది. 
http://i56.tinypic.com/2z8wbio.jpg
దానికి కుడి అంచున ఉన్న గోధుమ రంగు భాగాన్ని PCI slot లో అమర్చటానికి ఉపయోగిస్తారు. క్రింది వైపు ఉన్న VGA port మరియు DVI port లు CPU నుంచి బయటకు వస్తాయి. (ఈ port ల గురించి అవగాహన కొరకు ఈ post ను గమనించండి.) అనగా మనం ఒక vga card ని కనుక ఈ PCI slot లో ఉంచినట్లయితే motherboard మీద నిర్మితమై cpu వెనుకనున్న vga పోర్ట్ పని చెయ్యటం మానివేస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన vga card మాత్రమే ముందుగా processor ద్వారా గుర్తింప బడుతుంది. 


ప్రస్తుతం ఈ PCI slots లో వచ్చిన అధునాతన విప్లవం PCI express. దీని ద్వారా ఒకే సారి రెండు మూడు vga card లను అధిక వేగంతో పనిచేయించ వచ్చును. ఈ vga card లు అధునాతన LCD tv లకు LED tv లకు కంప్యూటర్ ని అనుసంధానం చెయ్యటానికి ఉపయోగపడతాయి. ఈ PCI cards మరియు PCI slots గురించి పూర్తి సమాచారాన్ని ముందు ముందు తెలుసుకుందాము. ఈ లోపుగా CPU కొనేముందు ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే అంశాన్ని తదుపరి POST లో గమనిద్దాం...
Related Posts Plugin for WordPress, Blogger...