ఇప్పటి వరకు ఉన్న ప్రాధమిక పరిజ్ఞానంతో CPU లోపల ఉన్న Processor గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా CPU యొక్క నమూనా పటాన్ని ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ అన్నిటికన్నా పైన ఉన్నది Processor. ఇది కంప్యూటర్ కి చిన్న మెదడు లాంటిది అని చెప్పుకున్నాము. కానీ పటంలో CPU అని గుర్తించబడి ఉన్నది ఏమి అని అడగవచ్చును. మీరు CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో చర్చనీయాంశాలను చూసినట్లయితే CPU గురించి ఒక విషయం గమనించి ఉంటారు. అది ఏమంటే "సందర్భాన్ని బట్టి CPU ని Processor , Memory, మరియు ఇతర భాగాలతో కూడిన డబ్బాగా అనుకోవచ్చును. లేదంటే ఒక్క Processor నే CPU గా అభివర్ణించవచ్చును." అని. మనం CPU లోపల ఉన్న చిన్న చిన్న భాగాలను గురించి వివరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి; ఈ సందర్భంలో CPU అనేది Processor అవుతుంది. (తదుపరి చర్చ మొత్తంలోనూ Processor అన్న పదమే ఉపయోగింపబడింది. పాఠకుల అవగాహన కొరకు మాత్రమే పై వివరణ ఇవ్వబడింది.)
పై పటంలో Processor తరువాత ముఖ్యంగా కనబడుతున్నవి చదరంగా ఉన్న మరొక రెండు భాగాలు. అందులో పైన ఉన్నది North bridge అనగా ఉత్తర వారధి. క్రింద ఉన్నది South bridge అనగా దక్షిణ వారధి. పై పటాన్ని ప్రపంచ పటంగా అనుకుంటే ఉత్తర దిక్కున ఉన్న దానిని ఉత్తర వారధి అన్నారు. దక్షిణ దిక్కున ఉన్న దానిని దక్షిణ వారధి అన్నారు. అవి ఇతర భాగాలకు Processor కు నడుమ వారధులుగా పని చేస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది.
ఇక పోతే ఈ north bridge కి processor కి నడుమ ఉన్న మార్గాన్ని system bus లేక local bus లేక Front Side Bus అంటారు. అంటే రాజ మార్గము అని చెప్పుకోవచ్చును. ఇది CPU లోకెల్లా అత్యంత వెడల్పైన అత్యంత వేగవంతమైన BUS. (CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో ఇప్పటికే చెప్పి ఉన్నాను BUS అనగా మార్గము అని, సాధారణ ప్రయాణ సాధనం లాంటిది కాదు అని; గమనించగలరు.) ఈ north bridge ద్వారా అత్యంత వేగంగా పనిచేసే, అత్యంత వేగం అవసరం ఐన సాధనాలు system bus కి కలుపబడి ఉంటాయి. ఉదాహరణకి గమనించినట్లైతే RAM, PCI express, Graphic card లాంటివి. ఈ north bridge లో సమాచార వేగం దాదాపుగా processor వేగానికి సమానంగా ఉంటుంది. (ఈ వేగాలు యెంత ఉంటాయి అనేది అంకెలలో త్వరలో తెలుసుకుందాము.)
ఇక మిగిలిన Hard disk , sound card , USB ports మరియు ఇతర PCI పోర్ట్ లు south bridge ద్వారా north bridge కి తద్వారా system bus కి కలుపబడి ఉంటాయి. ఈ south bridge లో సమాచార వేగం north bridge తో పోలిస్తే సుమారు 5 నుంచి 10 వ వంతు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా processor కి కలుపు బడుతున్న భాగాలు అంత వేగంగా పని చెయ్యలేవు కాబట్టి వాటికి అంత వెడల్పైన BUS అవసరం లేదు. ఈ south bridge కి north bridge కి మధ్య ఉన్న bus ని PCI BUS అంటారు. ఎందుకంటే దీని ద్వారా దాదాపుగా అన్నీ బాహ్యంగా కలుపబడే (peripheral) మరియు వేగం పరంగా అంత ప్రాధాన్యం లేని భాగాలే కలుపబడుతున్నాయి కాబట్టి.
ఎలాగైతే మహారాజుకి ఆంతరంగిక సలహాదారులు, ప్రధాన మంత్రి అత్యంత ఆప్తులుగా ఉండి అంతఃపురంలో కూడా మహారాజును కలవగలరో అలాగే ఈ north bridge ద్వారా కలుపబడినవి కూడా CPU కి అంత ముఖ్యమైనవి. CPU యొక్క సామర్ధ్యాన్ని వేగాన్ని నిర్ధారించేవి ఈ north bridge ద్వారా కలుపబడిన భాగాలే. ఇక పోతే ఎలాగైతే మిగిలిన అధికారులు, ప్రజలు, యాత్రికులు మహారాజుని కలవాలంటే సభలో మాత్రమే కలవగలరో, అలాగే ఈ south bridge ద్వారా కలుపబడిన భాగాలు కూడా అంత ప్రాధాన్యత సంతరించుకోక north bridge ద్వారా processor కి కలుప బడతాయి. ఇవి మన CPU కి అదనపు హంగులు మాతమే అవుతాయి.
కాబట్టి మన CPU యొక్క సామర్ధ్యాన్ని, వేగాన్ని నిర్ధారించే processor, RAM మరియు ఇతర భాగాలను గురించి తదుపరి post లో వివరంగా తెలుసుకుందాము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి