8, ఫిబ్రవరి 2011, మంగళవారం

CPU లోపల ఏముంది? - 3

ఇప్పటి వరకు CPU లో సమాచార నిల్వకు సంబంధించిన భాగాలను గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు కంప్యూటర్ లోని ఇతర ముఖ్య భాగాలను గురించి తెలుసుకుందాము. 
http://i56.tinypic.com/9ulxqu.png 
 ఈ పటంలో కనిపించే 5వ భాగం CD/DVD ప్లేయర్. ఇది మనం చూసే సినిమా CD, DVD లను ప్లే చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇందులో కొత్తగా వస్తున్న మార్పు ఏమంటే BLU-RAY డిస్క్. మనకు తెలిసినంత వరకు సాధారణంగా CD లో అయితే ఒక్క సినిమా అదే DVD లో ఐనట్లైతే 5-6 సినిమాలు పడతాయి. ఇక్కడ CD అంటే compact disk, మరియు DVD అంటే digital video disk. మరి ఈ blu ray డిస్క్ విషయానికి వస్తే ఇందులో 25GB అనగా 35 సినిమాలు పడతాయి. 
http://i56.tinypic.com/294ht3b.jpg
ఈ blu Ray డిస్క్ చూడటానికి సాధారణ DVD లాగానే ఉన్నది. మరి అందులో అంత ఎక్కువ సమాచారాన్ని ఎలా నిల్వ చేసుకోగల్గుతుంది అనే అనుమానం కలుగవచ్చు. DVD కి BLU RAY డిస్క్ కి ముఖ్యమైన తేడా ఆ డిస్క్ లో కాక అందులో సమాచారాన్ని వ్రాసే విధానంలో ఉంది. మనం స్కెచ్ పెన్ తో అక్షరాలను వ్రాస్తే అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అదే మామూలు పెన్ తో వ్రాస్తే అది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఈ క్రింద చూపిన విధంగా...
http://i53.tinypic.com/25irjiq.jpghttp://i52.tinypic.com/24oye12.jpg
అదే విధంగా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో DVD లో కన్నా దగ్గరగా సమాచారాన్ని వ్రాసే వ్యవస్థను తయారు చేసారు. మరి అంత దగ్గరగా వ్రాసినప్పుడు తట్టుకునే విధంగా blu ray డిస్క్ ను DVD కన్నా ఎక్కువ సాంద్రత (density)తో తయారు చేసారు. దీనిని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుసుకుందాము. ఈ blu ray డిస్క్ ఇంకా అంత ప్రాచుర్యం లోకి రాలేదు. 


మరి ఈ CD/DVD డ్రైవ్ యేవిధంగా ఉంటుందో చూద్దాం.
http://i55.tinypic.com/msce8o.jpghttp://i55.tinypic.com/2drfhc8.jpg
ఈ విధంగా ఈ CD/DVD  డ్రైవ్ లకు కూడా ఒక power కేబుల్ మరియు ఒక DATA కేబుల్ ఉంటాయి. ఆ నలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉన్నది POWER CABLE. ఆ రెండవది DATA కేబుల్. గమనించినట్లైతే దీనికి కూడా IDE మరియు SATA అని రెండు రకాల connections ఉన్నాయి. mothebard మీద హార్డ్ డిస్క్ ను ఎక్కడైతే కలుపుతామో ఈ DVD Drive ను కూడా అవే socket లలో కలుపవచ్చు. అందుకే motherboard మీద ఒకటి కన్నా ఎక్కువ sockets ఉంటాయి. మరిన్ని వివరాలకు ముందు POST గమనించగలరు.


ఇక motherboard మీద అంతటి ప్రాధాన్యత సంతరించుకోని అతి ముఖ్యమైన భాగం PCI SLOT. అది మొదటి పటంలో 7వ భాగం. PCI ని విస్తరిస్తే Peripheral Component Interconnect అవుతుంది. అనగా CPU కి, బాహ్యంగా అనుసంధానం చేసే భాగాలకి మధ్య వారధి అని అర్ధం చెప్పుకోవచ్చును. కంప్యూటర్ ప్రధాన భాగాలను పక్కన పెడితే మనకు అవసరమైన అదనపు భాగాలను connect చెయ్యటానికి దీనిని ఉపయోగిస్తారు. మరి అసలు అదనపు భాగాలు ఎందుకు అవసరం అవుతాయి, ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం. 


మనం ఒక మంచి కారు కొని దేశ రాజధానికి ప్రయానమవుతున్నాం అనుకుందాం. రాజధాని కాబట్టి దానిని చేరుకోవటానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. మొదటిది హైవే (ప్రధాన రహదారి) అయితే మరొకటి సాధారణ మార్గం. 


http://i52.tinypic.com/a056s.jpghttp://i51.tinypic.com/20koetf.jpg

 మరి మన కారు యొక్క పూర్తి వేగాన్ని చూడాలి అంటే మనం తప్పని సరిగా ప్రధాన రహదారిలోనే ప్రయాణం చెయ్యాలి.

అలాగే మనం CPU వెనుక భాగాన్ని గమనించినట్లైతే (ఇక్కడ చూడండి.) అక్కడ ఉన్న LAN port కానీ VGA పోర్ట్ కానీ, AUDIO ports కానీ ప్రస్తుతం వస్తున్న అధునాతన పరికరాల వేగంతో పని చెయ్యక పోవచ్చును. అలాగని వాటిని మార్చాలి అంటే మొత్తం motherboard ని మార్చాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ PCI slots ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ PCI slots పూర్తి స్థాయి bus నిడివితో motherboard కి కలుపబడి ఉంటాయి. (ఇక్కడ bus అంటే కంప్యూటర్ లో సమాచారం ప్రయాణించే మార్గము. అంతే కానీ వాహనం కాదు. గమనించ గలరు.)అనగా ఆయా అధునాతన పరికరాల పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తాయి. 

 మరి ఇక్కడ ఉన్న అన్ని PCI slot లు ఒకే విధంగా ఈ క్రింద చూపిన విధంగా ఉంటే, అవే slots; VGA card కి, AUDIO card కి, LAN card కి ఒకే విధంగా ఎలా పని చేస్తాయి అనే అనుమానం రావచ్చును. 
http://i51.tinypic.com/4lnlt3.jpg http://i53.tinypic.com/2d9v1n4.jpg

 (ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నవి PCI slot లు.) మనకు ఎలాగైతే ఎడ్ల బండి, సైకిలు, స్కూటరు, కారు, లారీ వంటి వివిధ వాహనాలు వచినప్పటికి రోడ్డు మాత్రం ఒకటే ఉన్నదో అదే విధంగా వివిధ పరికరాలు ఉన్నప్పటికీ ఈ PCI slots మాత్రం ఒకే విధంగా ఉండేలాగా నిర్మించబడ్డాయి. అంటే ఇవి ఒక విధంగా processor ని చేరుకోవటానికి ఒక దగ్గర మార్గం మాత్రమే అంతే కానీ ఒక పరికరం కాదు గమనించ గలరు.

ఏ విధంగా అయితే వినాయకుడు పితృభక్తితో గణాధిపత్యాన్ని సులభంగా పొందాడో, అదే విధంగా కొత్త పరికరాలు ఈ PCI slots ద్వారా పూర్తి వేగంతో CPU వెనుక ఉండే port ల కన్నా ముందుగా processor ని చేరి ఉపయోగింప బడతాయి. ఉదాహరణకు vga card ని గమనిద్దాం. అది ఈ విధంగా ఉంటుంది. 
http://i56.tinypic.com/2z8wbio.jpg
దానికి కుడి అంచున ఉన్న గోధుమ రంగు భాగాన్ని PCI slot లో అమర్చటానికి ఉపయోగిస్తారు. క్రింది వైపు ఉన్న VGA port మరియు DVI port లు CPU నుంచి బయటకు వస్తాయి. (ఈ port ల గురించి అవగాహన కొరకు ఈ post ను గమనించండి.) అనగా మనం ఒక vga card ని కనుక ఈ PCI slot లో ఉంచినట్లయితే motherboard మీద నిర్మితమై cpu వెనుకనున్న vga పోర్ట్ పని చెయ్యటం మానివేస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన vga card మాత్రమే ముందుగా processor ద్వారా గుర్తింప బడుతుంది. 


ప్రస్తుతం ఈ PCI slots లో వచ్చిన అధునాతన విప్లవం PCI express. దీని ద్వారా ఒకే సారి రెండు మూడు vga card లను అధిక వేగంతో పనిచేయించ వచ్చును. ఈ vga card లు అధునాతన LCD tv లకు LED tv లకు కంప్యూటర్ ని అనుసంధానం చెయ్యటానికి ఉపయోగపడతాయి. ఈ PCI cards మరియు PCI slots గురించి పూర్తి సమాచారాన్ని ముందు ముందు తెలుసుకుందాము. ఈ లోపుగా CPU కొనేముందు ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే అంశాన్ని తదుపరి POST లో గమనిద్దాం...

4 కామెంట్‌లు:

Mr.MENA చెప్పారు...

మీ బ్లాగు చాలా విజ్ఞానదాయకంగా ఉంది.ఇలాంటి ఎన్నో విషయాలను మున్ముందు తెలియచేయాలని కోరుకుంటున్నాను.ఈ మెయిల్ కి పంపే వెసులుబాటు ఉంటే ఈ క్రింది ఈ మెయిల్ కి పంప గోరుతున్నాను.
mr.saptagiri@gmail.com


.....మిస్టర్ మేన

అజ్ఞాత చెప్పారు...

CPU is one single chip. Do not confuse yourself and your audience with computer and CPU.

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

Dear Mr. Anonymous:

Please check this link:

http://computer.yourdictionary.com/cpu


which says:

Depending on which end of the field you are in, a CPU can mean the processor, memory and everything inside the cabinet, or just the microprocessor itself.


Computer Desktop Encyclopedia THIS DEFINITION IS FOR PERSONAL USE ONLY
All other reproduction is strictly prohibited without permission from the publisher.
Copyright © 1981-2010 by Computer Language Company Inc. All rights reserved.Know your stuff ... talk like a pro.అనగా సందర్భాన్ని బట్టి CPU ని "Processor , Memory, మరియు ఇతర భాగాలతో కూడిన డబ్బాగా అనుకోవచ్చును. లేదంటే ఒక్క Processor నే CPU గా అభివర్ణించవచ్చును."

for further details contact me:

sanjeevchs@gmail.com

అజ్ఞాత చెప్పారు...

very nice.it is very useful to every computer student.....great job

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...