2, ఫిబ్రవరి 2011, బుధవారం

CPU వెనుక భాగం...

నిన్నటి పోస్ట్ లో CPU ముందు భాగంలో ఏ ఏ ఉపకరణాలను connect చెయ్యవచ్చో చూశాము. అవన్నీ కూడా దాదాపుగా వినోదానికి సంబంధించినవే అవటం ఒక విశేషం. మరి ఇక CPU వెనుక భాగంలో ఏమేమి connect చెయ్యవచ్చో చూద్దాం. వీటిలో ముఖ్యంగా CPU కి మనకి మధ్య రాయబారులుగా పనిచేసే ఉపకరణాలే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు అసలు CPU వెనుక ఏ ఏ PORTలు (ద్వారాలు) ఉంటాయో చూద్దాం.
http://i52.tinypic.com/27y3gnm.jpg

  ఇందులో పైన ఉన్న భాగాన్ని SMPS అంటారు. అనగా Switch Mode Power Supply. CPU లోని అన్ని భాగాలకు దేనికి తగినంత శక్తిని దానికి సరఫరా చెయ్యటమే దీని పని. ఈ SMPS లు క్రింద చూపిన విధంగా రెండు ఆకారాలలో తయారుఅవుతున్నాయి. 
http://i54.tinypic.com/mip2rc.jpghttp://i52.tinypic.com/2dj9q9i.jpg         
 మొదటి రకంలో ఒక స్విచ్ మరియు పవర్ కేబుల్ input మాత్రమే ఉన్నాయి. దానికి ఈ క్రింద చూపిన cables లో మొదటి దానిని ఉపయోగించి స్విచ్ బోర్డు కి కలుపుతారు. 
http://i51.tinypic.com/2ephx5j.png

ఇక రెండవ రకం SMPS లో స్విచ్ కి బదులుగా మరొక POWER OUTPUT PORT అదనంగా ఉన్నది. దీనినుంచి Monitor కి Power ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. దీని కోసం పైన చూపించిన రెండవ కేబుల్ ని ఉపయోగిస్తారు. ఈ రెండవ రకం SMPS లు ఈ మధ్య కాలంలో అంత విరివిగా వాడకంలో లేవు. 
ఈ SMPS క్రింద CPU ని ఇతర ఉపకరణాలతో కలిపే PORT లు ఉన్నాయి. అవేమిటో మరింత దగ్గరగా చూద్దాం.
http://i52.tinypic.com/swfr5u.jpg

ఇక్కడ అన్నిటికన్నా పైన ఎడమ వైపు వంగపండు రంగులో ఉన్న పోర్ట్, KEYBOARD ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. దాని ప్రక్కన ఉన్న ఆకు పచ్చ రంగు పోర్ట్ Mouse ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఈ రెండిటిని PS2  పోర్టులు అంటారు.
http://i54.tinypic.com/2z83hmx.jpghttp://i51.tinypic.com/ej66j7.jpg
  సరిగ్గా గమనించినట్లైతే Mouse, Keyboard ల ప్లగ్ లు ఒకవైపు చదునుగా ఉంటాయి. ఆ చదునుగా ఉండే వైపు కుడి ప్రక్కన ఉన్నప్పుడు మాత్రమే ఆయా Plug లు socket లోకి వెళ్తాయి. ఈ దిశను సరిగా గమనించక పోయినట్లయితే Keyboard, Mouse పనికిరాని విధంగా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎటువంటి బలప్రయోగం చెయ్యకుండా సరైన దిశలో మాత్రమే చొప్పించండి. 
ఆ తరువాత ఉన్నవి USB PORTS. కొన్ని Keyboard లు Mouse లు ఇలాంటి USB ports తో క్రింద చూపిన విధంగా ఉంటాయి. 
http://i51.tinypic.com/293kciv.jpg http://i52.tinypic.com/212a3yu.jpg
 వీటిని ఈ keyboard లు Mouse లు connect చెయ్యటానికి మాత్రమే ఉపయోగించాలి. లేకపోతే ఖాళీగా వదిలెయ్యాలి. PEN DRIVE లు connect చెయ్యటానికి ఉపయోగపడే PORT లు వేరే ఉన్నాయి. 

 ఆ తరువాత ఉన్నది SERIAL COMMUCATION PORT. పూర్వ కాలపు Cell Phone లు ఈ PORT ల ద్వారానే కంప్యూటర్ కి కలిపేవారు. ప్రస్తుతం వస్తున్న cell phone లు కెమెరాలు USB PORT ద్వారా కంప్యూటర్ కి కలుపబడుతున్నాయి. 
http://i52.tinypic.com/23hpnht.jpg http://i53.tinypic.com/2gufwr7.jpg

దాని పక్కనే కుడి వైపు 25 పిన్నులతో ఉన్న PORT ని parallel PORT అంటారు. దీనిని పూర్వకాలపు ప్రింటర్ లను connect చెయ్యటానికి ఉపయోగించేవారు. 

Serial PORT క్రింద ఉన్నది VGA PORT. ఇది Monitor ని connect చెయ్యటానికి ఉపయోగపడుతుంది. 

ఈ VGA PORT క్రింద మరికొన్ని USB PORT లు ఉన్నాయి. వీటిని PEN DRIVE లు మొదలైన వాటిని connect చెయ్యటానికి ఉపయోగించవచ్చు. 

ఈ USB PORT లకు కుడి ప్రక్కన Ethernet LAN Port ఉన్నది. ఇది BSNL/SIFI లాంటి తీగ (Cable)తో కూడిన INTERNET ను connect చెయ్యటానికి ఉపయోగిస్తారు. సాధారణంగా LAN Cable ఈ విధంగా ఉంటుంది.
http://i53.tinypic.com/20qxhle.jpghttp://i53.tinypic.com/fcnomq.jpg 
పై బొమ్మలో విధంగా LAN Cable కి ఒక నొక్కు ఉంటుంది. దీని వలన ఈ కేబుల్ ని CONNECT చేసేటప్పుడు 'టక్' మని చిన్న శబ్దం వస్తుంది. అలాగే దానిని  బయటకు తీసేటప్పుడు ఆ నొక్కు భాగాన్ని దగ్గరకు నొక్కి బయటకు తీయాలి. లేకపోతే అది విరిగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి.

USB PORT లకు క్రింద  మూడు రంధ్రాలతో SOUND PORTS ఉంటాయి. ఇందులో మొదట ఎరుపు రంగులో ఉన్నది MICROPHONE JACK. అనగా మనం మాట్లాడే మాటలను Record చెయ్యటానికి ఉపయోగపడుతుంది. రెండవది ఆకుపచ్చ రంగులో ఉన్నది AUDIO OUT JACK. అనగా CPU నుంచి వచ్చే శబ్దాలను SPEAKERS కు పంపేందుకు ఉపయోగపడుతుంది. ఇక మూడవది LINE IN JACK. ఇది RADIO, TV లాంటి వాటి నుంచి వచ్చే శబ్దాలను CPU లోకి పంపి RECORD చేసేందుకు ఉపయోగపడుతుంది.
అధునాతన CPU లలో మరికొన్ని అదనపు PORT లు కూడా వస్తున్నాయి. అవేమిటో కూడా చూద్దాం. 
http://i52.tinypic.com/29ave36.jpg
ఇందులో Mouse కొరకు PS2 PORT బదులుగా USB PORT లు ఉన్నాయి. serial , parallel PORT లకు బదులుగా అధునాతన HDMI మరియు OPTICAL SPDIF PORT లు ఉన్నాయి. సాధారణ VGA PORT కు అదనంగా దాని ఎడమ ప్రక్క  DVI PORT కూడా ఉన్నది. పై మూడింటిని మనం LCD TV మరియు PROJECTOR లకు connect చెయ్యటానికి ఉపయోగిస్తాము. వీటిని గురించిన పూర్తి  వివరాలు ముందు ముందు తెలుసుకుందాము. ఇంక చివరిగా MICROPHONE (గులాబి రంగు), LINE అవుట్ (ఆకుపచ్చ), LINE ఇన్ (నీలం) లతో పాటుగా వాటి పైన మరొక మూడు పోర్టులు SIDE SPEAKER (ఊదా రంగు), REAR SPEAKER (నలుపు రంగు) SUB-WOOFER (పసుపు రంగు) జాక్ లు కూడా ఉన్నాయి.


CPU లోపల అసలు ఏమి ఉన్నాయి లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక ముందు తెలుసుకుందాము...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...