12, ఫిబ్రవరి 2011, శనివారం

ప్రాధమిక పరిజ్ఞానం -2

కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు సమాచార నిల్వ మరియు సమాచార విశ్లేషణ గురించి ప్రాధమిక సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము...

పూర్వం ఆదిమానవుడు సంచార జీవితం గడిపేటప్పుడు ఎక్కడ నీరు ఆహారం పుష్కలంగా ఉంటుందో అక్కడకు వెతుక్కుంటూ వెళ్ళేవాడు. దాని కోసం ముందుగా ఒక వ్యక్తి ఈ ప్రాధమిక అవసరాలను వెతుక్కుంటూ వెళ్ళేవాడు. అవి ఎక్కడ లభిస్తే అక్కడ ఎండు కొమ్మలు, పచ్చి ఆకులు తగులబెట్టి పొగ రాజేసేవాడు. దానిని బట్టి మిగిలిన తెగ మొత్తం అక్కడకు చేరుకునేది. మొదటి సారిగా ఈ విధంగా నిప్పును సందేశాలను చేరవేయటానికి ఉపయోగించారు.
http://i55.tinypic.com/16bk39c.gifASCII Code


ఆ తరువాత దానినే యుద్ధ సమాచారాలను చేరవేయటానికి ఉపయోగించారు.
http://i55.tinypic.com/18ltmt.jpg http://i51.tinypic.com/25ppl5g.jpg
 ఇప్పటికీ మనం ఈ విధానాన్ని సముద్ర ప్రయాణంలో ఉపయోగిస్తున్నాము.
http://i51.tinypic.com/29d7rk2.jpg
 ఈ విధంగా చీకటి వెలుగులను సృష్టించటం ద్వారా సమాచారాన్ని ఒక చోటినుంచి మరొక చోటికి చేరవేసేవారు.


ప్రస్తుత కాలంలో ఈ చీకటి వెలుగులను సృష్టించటానికి మనం విద్యుత్ శక్తిని ఉపయోగిస్తున్నాము. స్విచ్ ని ON మరియు OFF చెయ్యటం ద్వారా లైట్ ని వెలిగించి ఆర్ప గలుగుతున్నాము. ఎదుటి మనిషి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలియని సమయంలో కూడా ఈ పద్దతి సమాచారాన్ని చేరవేయటానికి ఉపయోగపడింది.

 అలాగే మనం ఎలా ఉంటుందో తెలియని కంప్యూటర్ తో మాట్లాడాలంటే ఇలాంటి ON మరియు OFF మాత్రమే ఉన్న అత్యంత తేలిక పాటి భాష ఒకటి కావాలి. అదే Binary Code. లాటిన్ భాష లో Bi అంటే 'రెండు' అని అర్ధం. ఈ భాష లో రెండే పదాలు ఉన్నాయి కనుక ఆ పేరు వచ్చింది. కంప్యూటర్ ఎలాగు కరెంట్ తోనే పని చేస్తుంది కాబట్టి switch ON మరియు switch OFF లను గుర్తించ గల్గుతుంది.(దీనికి ప్రత్యేక ఏర్పాట్లు కావాలి. అవేమిటో తదుపరి post లో చూద్దాం.)


కంప్యూటర్ పరిభాషలో ON ను 1 గాను మరియు OFF ను 0 గాను సూచిస్తారు. మనం సాధారణంగా ఉపయోగించే దశాంశ మానం (0-9)లాగానే దీనిని ద్విసంఖ్యా మానం అంటారు. మొత్తం భాషలో 0 మరియు 1 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు 
రెండంకెలతో మనం నాలుగు వేర్వేరు సంఖ్యలను సృష్టించవచ్చు.
  00 01 10 11     2 x 2 = 4 
మూడంకెలతో మనం ఎనిమిది వేర్వేరు సంఖ్యలను మనం సృష్టించవచ్చును. ఈ క్రింది విధంగా...

       000 001 010 011  

       100 101 110 111        2 x 2 x 2 = 8 
అదే విధంగా 4 అంకెలతో 2x2x2x2 = 16 వేర్వేరు సంఖ్యలను సృష్టించవచ్చును.
ఆ తరువాత అమెరికా వారు మనం ఎక్కువగా ఉపయోగించే 128 అక్షరాలు, అంకెలు మరియు గుర్తులతో పాటు మనం అంతగా ఉపయోగించని మరొక 128 గుర్తులను కలిపి ASCII అనే ప్రామాణిక భాషను తయారు చేసారు. దానిని మనం ఇప్పుడు చూద్దాం.
ఈ మొదటి 31 కంప్యూటర్ ని నియంత్రించటానికి ఉపయోగిస్తారు.
http://i53.tinypic.com/154bu6u.png 
 ఈ తరువాత 97 సాధారణంగా ఉపయోగించేవి.
http://i54.tinypic.com/2d0lw07.png     http://i54.tinypic.com/2urat8g.png 

మరికొన్ని అంతగా ఉపయోగించని ప్రత్యేక చిహ్నాలు.
http://i55.tinypic.com/15hii6f.png    http://i55.tinypic.com/wtai35.png



ఆ విధంగా మనం ఉపయోగించే 256 వేర్వేరు గుర్తులను 256 ద్విసంఖ్యా మాన సంఖ్యలతో సూచించారు. అనగా ద్విసంఖ్యామానం లో  (2x2x2x2x2x2x2x2 = 256) ఎనిమిది అంకెల సంఖ్య అవుతుంది. కంప్యూటర్ పరిభాషలో ఒక్కొక్క ద్విసంఖ్యామాన అంకెను "Bit" (బిట్) అంటారు. అలాగే మొదటి 256 ద్విసంఖ్యామాన సంఖ్యలలో ఒక్కొక్క ఎనిమిది అంకెల సంఖ్య మనం ఉపయోగించే ఒక్కొక్క అక్షరాన్ని సూచిస్తుంది కాబట్టి దానికి కూడా ఒక పేరు పెట్టారు. అదే "Byte" (బైట్). 


ఆ విధంగా మనం చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని keyboard మీద టైపు చేసి కంప్యూటర్ కి చెప్పవచ్చును. అది binary భాషలో కంప్యూటర్ కి చేరుతుంది. 


ఇప్పటివరకు మనం కంప్యూటర్ కి అర్ధం అయ్యే భాషను తయారు చేసుకున్నాము. ఇక వచ్చే ముఖ్యమైన సమస్య దానికి ఏ స్థాయి లో ఆజ్ఞలను ఇవ్వాలనేది. దాని గురించి తరువాతి post లో చూద్దాం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...