ఈ రోజు CPU లో మిగిలిన భాగాలను గురించి తెలుసుకుందాము. ఈ క్రింది పటం గమనించినట్లైతే
క్రిందటి POST లో 1,2,3 మరియు 4 భాగాలను గురించి తెలుసుకున్నాము. మిగిలిన భాగాలలో ముఖ్యమైనది, 6వ భాగం. మనకు ఎలాగైతే ఎంత తార్కిక బుద్ధి (LOGICAL THINKING) ఉన్నప్పటికీ జ్ఞాపక శక్తి ఎంత అవసరమో, అలాగే కంప్యూటర్ కి కూడా PROCESSOR, RAM లతో పాటుగా సమాచారాన్ని నిల్వ చేసుకోవటానికి పెద్ద మెదడు లాంటి ఒక వస్తువు జ్ఞాపకాలను భద్రపరచుకోవటానికి అవసరం అవుతుంది. అదే ఈ 6వ భాగం. దానిని HARD DISK అంటారు. దాని పేరును బట్టి అది ఒక దృఢమైన చక్రం లాంటి వస్తువు అని అర్ధం అవుతుంది. మరి మరి అది చూడటానికి ఒక చెక్క పెట్టె లాగా ఉన్నదేమి అని అడగవచ్చును. దాని లోపల గమనించినట్లైతే ఈ విధంగా ఉంటుంది.
దయచేసి ఈ HARD DISK ని విప్పి లోపల ఏముందో చూసే ప్రయత్నం చెయ్యకండి. అది కుదరదు. (ఆ రెండవ పటం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది)మన పురాతన గ్రామ్ ఫోన్ రికార్డర్ ఉన్నట్లుగా లోపల పరికరాల అమరిక ఉన్నది. దాని పేరులో DISK అన్న పదం ఇక్కడ వర్తిస్తుంది. ఆ ప్లేట్లను గమనించినట్లైతే అవి చాలా పలుచగా వెంట్రుక వాసి మందంతో ఉన్నాయి. మరి దృఢత్వం (HARD) అనే పదం ఏ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని ఉపయోగించారు?
అది అర్ధం చేసుకోవాలంటే మనం RAM గురించి మరికొంత తెలుసుకోవాలి. ఇంతకూ క్రితం POST లో RAM గురించి మాట్లాడుతూ అందులో సమాచార వేగానికి మూల్యం వేరొక చోట చెల్లించాల్సి ఉంటుంది అని ప్రస్తావించటం జరిగింది. అది ఏమంటే ఈ RAM లో నిల్వ ఉండే సమాచారం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మరియు పొరపాటున దానికి అందే విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లయితే అందులో నిక్షిప్తమైన సమాచారం మొత్తం తుడిచి పెట్టుకు పోతుంది. అలా కాకుండా సమాచారం మొత్తం జ్ఞాపకాల పొరలలో నిక్షిప్తం చేసుకోవటానికి ధృడంగా లిఖించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకు కూడా ఏ విషయాన్నైనా మనసులో నాటుకుపోయేలా చెప్తే బాగా గుర్తు ఉంటుంది. అదే అంటి ముట్టనట్లు చెప్తే ఆ నిమిషంలో గుర్తు ఉంటుంది కానీ మరు నిమిషంలో మర్చి పోతాము. అలా నాటుకుపోయేలా లిఖించదగ్గ సాధనం HARD DISK లో ఉండటం మీరు గమనించే ఉంటారు. అది మన గ్రామ్ ఫోన్ రికార్డు లోని హెడ్ లాంటి ఆకారం. ఆ విధంగా ఈ HARD DISK లో లిఖించ బడిన సమాచారం ఎక్కువ కాలం వరకు మరియు విద్యుత్ సరఫరా నిలిచి పోయిన సందర్భాలలోనూ చెరిగిపోని విధంగా ధృడంగా లిఖించబడుతుంది. దాని పేరులోని దృఢత్వం ఇక్కడ వర్తిస్తుంది.
ఇక పోతే గ్రామ్ ఫోన్ లో మాదిరిగానే ఈ HARD DISK లో కూడా రీడ్ హెడ్ ని ఎక్కడికి కావాలంటే అక్కడకు జరుపుకొని అక్కడి సమాచారాన్ని పొందవచ్చు. ఆ విధంగా ఈ హార్డ్ డిస్క్ కూడా RANDOM ACCESS DEVISE గానే పరిగణింపబడుతుంది. కానీ RAM కి HARD DISK కి ఉన్న ముఖ్యమైన తేడా ఒకటి, శాశ్వత సమాచార నిల్వ. దానికి గాను మనం హార్డ్ డిస్క్ లో వెచ్చించబోయే వెల వేగం లో మందగింపు అవుతుంది.
ఇక పై పటంలో గమనించినట్లైతే ఈ హార్డ్ డిస్క్ కి రెండు తీగలు తగిలించి ఉన్నాయి. అందులో ఒకటి సమాచారాన్ని రాసేందుకు, చదివేందుకు తగిన విద్యుత్ శక్తి ని సరఫరా చేస్తుంది. మరొకటి సమాచారాన్ని Motherboard కి సరఫరా చేస్తుంది. మీరు పురాతన కంప్యూటర్ లలో గమనించినట్లైతే ఆ తీగలు మరికొంత వెడల్పుగా ఈ క్రింద చూపిన విధంగా ఉంటాయి.
పై రెండు రకాలలోను నలుపు ఎరుపు రంగు తీగలతో ఉన్న plug విద్యుత్ శక్తి ని సరఫరా చేస్తుంది. ఆ రెండవది Motherboard కి HARDDISK కి మధ్య సమాచారాన్ని చేరవేస్తుంది.
ఇక్కడ మొదటి పటం పురాతన HARDDISK లకు సంబంధించినది. దీనిని IDE cable (తీగ) అంటారు. రెండవది ప్రస్తుత కాలని చెందినది. దానిని SATA కేబుల్ అంటారు. సరిగ్గా గమనించినట్లైతే IDE కేబుల్ మధ్యలో ఒక రంధ్రం మూసుకొని ఉన్నది. అంటే ఇది ఒక దిశలో మాత్రమే HARD DISK కి అనుసంధానం అవగలదు. సరిగా గమనించండి. అయితే విచిత్రంగా IDE cable తో కన్నా SATA cable తోనే సమాచార సరఫరా వేగం అధికంగా ఉంటుంది. అది ఎందుకనేది త్వరలో తెలుసుకుందాం. అయితే ఈ IDE లేక SATA కేబుల్ ను motherboard కు అనుసంధానం చెయ్యటానికి motherboard మీద ఈ క్రింద చూపిన విధంగా రెండు రకాల SOCKETs ఉంటాయి.
అయితే మనం చెప్పుకున్నట్లు SATA కేబుల్ తో వేగం అధికంగా ఉంటుంది కాబట్టి పురాతన HARDDISK లను ఇలాంటి SATA HARDDISK లతో భర్తీ చెయ్యవచ్చు. అందుకు ఈ క్రింద చూపిన పరికరాలు నూతన HARD DISK కు పురాతన MOTHER BOARD మరియు POWER SUPPLY ల మధ్య అవసరం అవుతాయి.
ఇక్కడ మొదటిది IDE TO SATA Converter. రెండవది SATA పవర్ కేబుల్.
CPU లో మిగిలిన భాగాలను గురించి తదుపరి POST లో తెలుసుకుందాము. అంతవరకూ సెలవు తీసుకుంటూ..

7 కామెంట్లు:
ఈ పోస్ట్ బాగుందండి. కానీ "దానికి గాను మనం హార్డ్ డిస్క్ లో వెచ్చించబోయే వెల వేగం లో మందగింపు అవుతుంది." ఈ వాక్యం అర్ధం కావడంలేదండి, కొంచెం వివరించి చెప్తారా!
ముందస్తు కృతజ్ఞతలతో
ఇక్కడ నా ఉద్దేశ్యం హార్డ్ డిస్క్ లో DATA (సమాచారం)ను శాశ్వతంగా నిల్వ చేసుకోవటం అనే అదనపు సౌలభ్యం పొందటం ద్వారా మనం కోల్పోయిన మరొక ముఖ్య సౌలభ్యం ఏమంటే హార్డ్ డిస్క్ లోని DATA ను తిరిగి పొందాలి అంటే RAM లో దొరికినంత త్వరగా ఇక్కడ లభించదు. ఉదాహరణకు 800MHz DDR RAM నుండి మనం 12.6GB/second వేగంతో సమాచారాన్ని పొందవచ్చు. అదే హార్డ్ డిస్క్ లో ఐనట్లైతే ఈ వేగం 0.1875GB/second ఉంటుంది. అదే అధునాతన SOLID STATE DRIVE లో ఐనట్లైతే ఈ వేగం ౦.768GB/second గా ఉంది. ఈ solid state drive లు ప్రస్తుతం ఉన్న HARD DISK లకు ప్రత్యామ్నాయం గా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. మీరు గమనించినట్లైతే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న HARD DISK లు RAM తో పోల్చినట్లైతే 100 వ వంతు వేగంతో మాత్రమే పని చేస్తున్నాయి. అదే SOLID STATE DRIVE లు 15 వ వంతు వేగంతో పని చేస్తున్నాయి. ఈ hard disk ల గురించి పూర్తి వివరాలు త్వరలోనే మీరు తెలుసుకుంటారు.
ధన్యవాదములు
baagundi
చాలా బాగుంది. Dual core మరియు i3 అంటే ఏమిటో మరియు తేడాలను దయచేసి.వివరించండి
bagundi deeniki mundu post links kuda ikkade pedite baguntundi
hard disk data revery software link ith seril key
కామెంట్‌ను పోస్ట్ చేయండి