4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

CPU లోపల ఏముంది? - 1

మొదటి రోజునుంచి ఉత్కంఠ రేపుతున్న మూసిన గుప్పెటను ఈ రోజు మనం తెరవబోతున్నాం.  అదేనండి CPU లోపల ఏముందో చూడబోతున్నాం. ముందు జాగ్రత్త చర్యగా CPU కి ఉన్న అన్ని తీగలను తొలగించండి. ముఖ్యంగా POWER cable (తీగ). ఇప్పుడు CPU వెనుక భాగాన గమనించినట్లైతే దాని కుడి అంచున రెండు, ఎడమ అంచున రెండు స్క్రూలు ఉంటాయి. సాధారణంగా CPU ని తెరవాలంటే కుడి వైపున ఉన్న రెండు స్క్రూలను తీయవలసి ఉంటుంది.  సరైన స్క్రూ డ్రైవర్ ని ఎంచుకుని కుడి అంచున ఉన్న రెండు స్క్రూలను తీయండి.
http://i56.tinypic.com/316q1yx.jpghttp://i54.tinypic.com/n39sap.jpg
ఇప్పుడు రెండవ పటంలో చూపిన విధంగా మూతను ముందుగా కుడి చేతితో మీ వైపుకు లాక్కొని ఆ తరువాత ఎడమ చేతితో బయటకు తియ్యండి. ఇక్కడ ఏ చేతితో తీస్తున్నమనేది కాదు కానీ ఏ దిశలో తీస్తున్నామనేది గమనించండి. లేదంటే ఈ క్రింది పటంలో చూపిన విధంగా ముందుగా ఎడమ వైపుకు జరిపి ఆ తరువాత పైకి తియ్యండి. 
http://i55.tinypic.com/2j0miw5.jpg 
ఇప్పుడు CPU లోపల భాగాలను గమనించండి. 
http://i56.tinypic.com/9ulxqu.png

ఇక్కడ మొదటిది అన్నిటికన్నా పైన ఉన్నది SMPS అనగా POWER SUPPLY.ఇది CPU కి శక్తినిచ్చే భాగం. 
ఈ SMPS కి క్రింద చదరంగం బల్ల పరిమాణంలో సుమారు నలుచదరంగా ఉండి అన్ని ఎలక్ట్రానిక్ సర్కూట్ లతో గజిబిజిగా ఉన్న భాగమే మన CPU ఆడే అన్ని ఆటలకు రంగస్థలం. దాని పేరు కూడా ఇంచుమించు అలాంటిదే. దానిని Motherboard అంటారు. అంటే CPU కి తల్లి అంత ప్రధానమైనది అని. మనం ఎలాగైతే చదరంగం బల్ల మీద పావులు అన్ని పేర్చి ఆట మొదలు పెడతామో, అల్లాగే, ఎలాగైతే మొండేనికి ఒక ప్రక్క చేతులు, మరొక ప్రక్క కాళ్ళు, ఇంకొక ప్రక్క తల తగిలిస్తే పూర్తి శరీరం అవుతుందో అల్లాగే ఈ Motherboard మీద అన్నీ సరైన స్థానాలలో అమరిస్తే computer తయారవుతుంది. 

ఈ Motherboard లోకెల్లా అతి ముఖ్యమైనది, అతి ఖరీదైనది, అతి సున్నితమైనది మరియు చిన్నది మధ్యలో FAN ఆకారంలో గుండ్రంగా ఉన్న భాగం. అసలు భాగం ఆ FAN క్రింద సేద తీరుతూ ఉన్నది. అదే PROCESSOR. మన చిన్న మెదడు లాగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేది, మొత్తం కంప్యూటర్ ని శాసించే అతి ముఖ్యమైన భాగం ఇదే. అందుకే దానికి అన్నీ రాచ మర్యాదలు. CPU మొత్తానికి కలిపి ఒకే ఒక FAN ఎడమ వైపు డబ్బాకి తగిలించి ఉంటే ఈ processor కి మాత్రం ప్రత్యేకంగా మరొక FAN ఏర్పాటు చెయ్యబడింది. 

ఎలాగైతే రావణుడి ప్రాణాలు గుండెలో కాకుండా భద్రంగా అనేక కవచాల మధ్య కడుపులో దాచుకున్నదో అలాగే ఈ processor కూడా FAN క్రింద అనేక కవచాల నడుమ భద్రంగా దాచబడిన అంగుళం ప్రమాణం లో ఉండి వెంట్రుక వాసి మందంతో ఉన్న నలుచదరపు వస్తువు. 
http://i55.tinypic.com/2il08eh.jpg  http://i54.tinypic.com/11qjpdv.jpg

 ఆ రెండవ బొమ్మలో పెద్ద చదరం మధ్యలో తెల్లగా కనిపిస్తున్నది అదే...
ఆ తరువాత దాని చుట్టూ రక్షణ వలయాలు యెంత కట్టుదిట్టంగా ఉంటాయి అంటే, దాని మీద ఈగ కాదు కదా, కనీసం దుమ్ము రేణువు కూడా తగలనంత జాగ్రత్తగా ఏర్పాట్లు ఉంటాయి. ఎందుకంటే దుమ్ము తగిలినా అది పని చెయ్యటం మానేస్తుంది. ఎలాగైతే విద్యార్ధి తలమీద వెన్న ముద్దైనా కరుగుతుందంటారో అలాగే ఈ processor చేసే పనికి అంత వేడి పుడుతుంది. అందుకే దాని నెత్తిమీద తడి గుడ్డ వేసినట్లుగా HEAT SINK అనే (వేడిని గుంజుకునే) ఒక తెల్లని లోహపు బిళ్ళ ఉండి, దాని పైన ఒక FAN ఉంటుంది.  ఈ క్రింద చూపిన విధంగా...
http://i53.tinypic.com/dt93n.jpg 

దయచేసి ఆ FAN కి HEAT SINK కి పట్టిన దుమ్ముని దులపటం తప్ప(అది కూడా సున్నితంగా), ఆ భాగాన్ని కనీసం కదిలించే ప్రయత్నం కూడా చెయ్యవద్దు. దానిని మళ్లీ యధాస్థానంలో సక్రమంగా స్థాపించాలంటే నిపుణుల వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో ఎటువంటి ప్రయోగాలు చెయ్యకండి. ఈ ఒక్కటి తప్ప దేనినైనా మనం ఊడతీసి బిగించవచ్చు. ఆ వివరాలు క్రింద చూద్దాం.

ఈ PROCESSOR తరువాత ముఖ్యమైన భాగం దాని కుడి ప్రక్కన SCALE బద్ద ఆకారంలో ఉన్న RAM. ఎలాగైతే మనం ముఖ్యం అనుకున్న విషయాలను నోట్లో మననం చేసుకుంటామో అలాగే ఈ RAM కూడా processor కి అతి ముఖ్యమైన విషయాలు, తరచూ అవసరం అయ్యే విషయాలను భద్రపరచి PROCESSOR కి అవసరమైనప్పుడు అందిస్తుంది.
http://i52.tinypic.com/2iaefew.jpghttp://i51.tinypic.com/2d7yr9x.jpg


RAM అంటే Random Access Memory అనగా దీనిలో నిల్వ ఉన్న (అతి కొద్ది మరియు అత్యంత అవసరమైన) సమాచారం మొదటి నుంచి చివరి వరకు ఏ భాగాన్నైనా మనం ఒకే వేగంతో అంది పుచ్చుకోవచ్చు. Random అంటే యాదృచ్చికం అని అర్ధం. అంటే RAM లోని సమాచారాన్ని మనం యాదృచ్చికంగా ఎక్కడిదైనా ఒకే వేగంతో పొందవచ్చు. అనగా సమాచార సరఫరా లో ఎటువంటి ఆలస్యం ఉండదు. మనం నోట్లో మననం చేసుకునేది కూడా ఇలా అడిగిన వెంటనే గుర్తుకు రావటానికే గమనించగలరు. అయితే ఇక్కడ సమాచారం సరఫరా లో వేగం పొందినందుకు మూల్యం మనం మరొక చోట వెచ్చించాల్సి ఉంటుంది. ఆ విషయాలు తదుపరి POST లో తెలుసుకుందాము.


 ఈ RAM ని సవరించాల్సిన అవసరం అప్పుడప్పుడు కలగవచ్చు. అప్పుడు దానికి రెండు వైపులా ఉన్న క్లిప్పు లాంటి వాటిని ఎడం చేసి దానిని తొలగించాలి.
 http://i56.tinypic.com/213n1v8.jpghttp://i54.tinypic.com/v6stx2.jpg

  RAM కి మధ్యలో ఉన్న నొక్కు(పటం లో 3), MOTHERBOARD మీద RAM SLOT (RAM ఉంచే స్థానం) కి మధ్య ఉన్న నొక్కు (పటం లో 4)ఒక దిశలో మాత్రమే ఏకీభవిస్తాయి. అది గమనించి పెట్టాలి. RAM ని ఆ విధంగా SLOT లో ఉంచిన తరువాత (గమనించండి RAM ని అక్కడ ఉంచాలి, అంతే కానీ నొక్కి బల ప్రయోగం చెయ్యవలసిన అవసరం లేదు.) ఆ తరువాత రెండు వైపులా ఉన్న క్లిప్పులను RAM యొక్క పై నొక్కు (పటం లో 1) లోకి చేరేటట్లుగా నొక్కాలి. ఇక్కడ రెండు వైపులా 'టక్' మని శబ్దం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక విధంగా ఆ శబ్దమే RAM సక్రమంగా అమర్చబడింది అనటానికి సూచన. ఒక్కొక్క సారి ఈ 'టక్' అనే శబ్దం రాక పోవచ్చు కానీ రెండు ప్రక్కలా క్లిప్పులు పై నొక్కులోకి చేరి ఉండవచ్చు. గమనించండి. అనవసరంగా కంగారుపడి దాని మీద బల ప్రదర్శన చేయకండి.   


స్థలాభావం వల్ల మిగిలిన భాగాలను గురించి వివరంగా తరువాత POST లో గమనిద్దాం... ఈ లోపు CPU మూతను యధా స్థానంలో బిగించి ఉంచండి...

9 కామెంట్‌లు:

Sravanthi చెప్పారు...

చాలా బాగా చెప్పారండి! మీ next post కోసం ఎదురుచూస్తున్నాను

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

మీ అభిమానానికి కృతజ్ఞుడను. ఈ మీ ఆదరాభిమానాలను నిలబెట్టుకోగలనని ఆశిస్తూ...

అజ్ఞాత చెప్పారు...

చాలా అద్భుతంగా వివరిస్తున్నారండి. మీ బ్లాగుకు నేను అభిమానినైపోయాను....

Amóes Xavier చెప్పారు...

Olá! Um abraço!

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

THANK YOU! Mr. Amóes Xavier!

If you don't mind, may I know how could you understand Telugu... Please...

With regards,
SANJEEV

అజ్ఞాత చెప్పారు...

2gb ram na matherbord except cheytledu 1 gb ram except chesthundi emicheyyali

నా బ్లాగ్ నా ఇష్టం చెప్పారు...

ముందుగా ఆ 2GB RAM పని చేస్తుందో లేదో వీలైతే వేరొక SYSTEM లో పెట్టి గమనించండి. ఒక వేళ ఆ RAM పని చేస్తున్నట్లైతే మీ PROCESSOR Configuration గమనించండి. ఇది మీ My Computer మీద Right Click చేసి Properties గమనించినట్లైతే తెలుస్తుంది. Pentium-III processor కి Maximum possible RAM 1GB మాత్రమే. అలాగే Pentium-IV కి 4GB మరియు కొన్ని ప్రత్యేక సందర్భాలలో 3GB RAM మాత్రమే ఉపయొగించుకోగల్గుతుంది (http://en.wikipedia.org/wiki/3_GB_barrier). కాబట్టి మీ PROCESSOR గురించిన సమాచారం అలాగే Operating system XP లేక Windows-7 మరియు 32-bit/64-bit అనే సమాచారం కూడా నాకు తెలిపినట్లైతే తదుపరి సమస్యను గురించి ఆలొచించవచ్చును.

Unknown చెప్పారు...

telugu computer hardware books kavalandi.

ajju చెప్పారు...

http://computerintelugu.blogspot.in/p/blog-page_15.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...